Home  »  TV News  »  Illu illalu pillalu : రిపోర్ట్స్ మాయం చేసిన సుకన్య.. వల్లి అసలు రంగు బయటపెట్టనున్న ధీరజ్!

Updated : May 15, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -471 లో..... నిన్న రాత్రి నన్ను ఎలా పరిగెత్తించావో తెలుసా అని ప్రేమని ధీరజ్ దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడే నర్మద వచ్చి.. ప్రొద్దున్నే మొదలుపెట్టారా మీ రొమాన్స్ అని నర్మద అంటుంది. అది కాదు వదిన అని ధీరజ్ ఏదో చెప్పబోతుంటే మాక్కూడా పెళ్లి అయింది నాకే ట్యూషన్ చెప్తావా అని నర్మద అంటుంది. ప్రేమ నీకొక విషయం చెప్పాలని తనని పక్కకి తీసుకొని వెళ్తుంది నర్మద. నిన్న పాలలో పౌడర్ కలిపింది ఆ సుకన్యనే.. చందు బావని వల్లిని ఒకటి చేయడానికి కలిపిందట.. నాకు ఎందుకో డౌట్ గా ఉందని నర్మద అంటుంది. అవును అక్క అసలు వల్లికి ప్రెగ్నెన్సీ లేదేమోనని అనిపిస్తుంది. మొన్న ఇచ్చిన స్కానింగ్ లో వల్లి అక్క పేరు లేదని ప్రేమ అంటుంది. ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకొని రా అని నర్మద చెప్తుంది 

దాంతో ప్రేమ వెళ్లి తన గదిలో పెట్టిన రిపోర్ట్స్ తీసుకొని రావడానికి వెళ్తుంది. తీరా చూస్తే అక్కడ రిపోర్ట్స్ ఉండవు. మరొకవైపు ఆ రిపోర్ట్స్ పట్టుకొని సుకన్య ఉంటుంది. నాకు ఇలాంటి సిచువేషన్ వస్తుందని ముందే తెలుసు.. అందుకే తీసుకొని వచ్చానని వల్లితో చెప్తుంది సుకన్య. నువ్వు సూపర్ సుక్కు అని వల్లి మురిసిపోతుంది. ఆ తర్వాత నర్మద దగ్గరికి ప్రేమ వచ్చి అక్క రిపోర్ట్స్ నా దగ్గర లేవు.. అక్కడే పెట్టాను కానీ అవి ఇప్పడు కనిపించడం లేదని నర్మదతో ప్రేమ చెప్తుంది. ఇదంతా చూస్తుంటే వల్లి ప్రెగ్నెంట్ కాదనిపిస్తుందని నర్మద అంటుంది. ఆ మాట సుకన్య, వల్లి విని షాక్ అవుతారు. అప్పుడే ధీరజ్ వచ్చి.. మీరు స్కానింగ్ చేసేటప్పుడు అక్కడ లేరా వదిన అని అడుగుతాడు. అప్పుడు మేం బయట ఉన్నామని నర్మద చెప్తుంది. ఇప్పుడు వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఎలా నిరూపించాలని నర్మద అనగానే ఏముంది ఇంకొక డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించడమే అని ధీరజ్ అనగానే అవునని ప్రేమ, నర్మద అంటారు. వాళ్ళ మాటలు విని వల్లిలో భయం మొదలవుతుంది. ఆ తర్వాత సాగర్ కి కాఫీ తీసుకొని ధీరజ్ వస్తాడు. ధీరజ్ తో సాగర్ గొడవ పెట్టుకుంటాడు. నీ బుద్ది అర్థం అయిందిరా అయిదు లక్షలు ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళమని చెప్పావు.. నువ్వు నన్ను చూసి ఓర్వలేకపోతున్నావని  ధీరజ్ తో సాగర్ గొడవపడుతాడు. నిన్ను ఆపాలని అలా చేసానని చెప్పినా సాగర్ వినిపించుకోడు.

మరొకవైపు భాగ్యం, ఆనందరావు ఇడ్లీ అమ్ముతారు. అమ్మడుకి ఫోన్ చేస్తానని భాగ్యం చేస్తుంది‌ వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. నా ఫోన్ కట్ చేస్తారా అని భాగ్యం అంటుంది. ఎదురుగా వాళ్లే వస్తారు. వల్లి జరిగింది మొత్తం చెప్తుంది. నాకు భయంగా ఉందని వల్లి అంటుంది. నీ గురించి బయట పెట్టడడం కాదు.. ఈ రోజు సాయంత్రానికల్లా ఆ నర్మద ఇంట్లో నుండి బయటకి వెళ్లేలా చేస్తానని భాగ్యం చెప్తుంది. ఆ తర్వాత వేదవతి దగ్గరికి ధీరజ్ వస్తాడు. తనతో వేదవతి మాట్లాడదు. మీ నాన్న డబ్బు ఇస్తే తీసుకోవడం లేదు కదా అని ధీరజ్ పై వేదవతి కోపంగా ఉంటుంది. అమ్మ కార్ కొన్నానని ధీరజ్ చెప్పగానే వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి చెప్పలేదని వేదవతి అనగానే సర్ ప్రైజ్ ఇద్దామని చెప్పలేదని ధీరజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.